స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వెయ్యడు : కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వెయ్యడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
రైతులకు ఎకరానికి రూ.15 వేలు మూడు పంటలు వేస్తానని అన్నాడు ఎవరికైనా పడ్డాయా? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశాడని టీ ఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికలు అయిపోయాక రైతుబంధుకు రాం రాం.. నాలుగు పంటలు కలిసి అసలు పట్టాదారు రైతులకు రూ.24 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.15 వేల కోట్లు మొత్తం రూ.39 వేల కోట్లు ఎగగొట్టాడని, రైతు రుణమాఫీ రూ.38 వేల కోట్లు ఎగగొట్టిండని, కేసీఆర్ నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తే, రేవంత్ రెడ్డి ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు.