స్వదేశంలో టీం ఇండియా మ్యాచ్‌‌ల విషయంలో బిసిసిఐ కీలక నిర్ణయం

స్వదేశంలో టీం ఇండియా మ్యాచ్‌‌ల విషయంలో బిసిసిఐ కీలక నిర్ణయం

స్వదేశంలో టీం ఇండియా మ్యాచ్‌‌ల విషయంలో బిసిసిఐ కీలక నిర్ణయం
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూన్ 9 :
స్వదేశంలో టీం ఇండియా   ఆడే పలు మ్యాచ్‌‌ల విషయంలో బిసిసిఐ   కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ప్రారంభం కాబోయే టీం ఇండియా హోం సీజనలో మార్పులు చేసింది. భారత సీనియర్ పురుషుల జట్టు.. వెస్టిండీస్, సౌతాఫ్రికాతో తలపడే మ్యాచ్‌ల వేదికలు, భారత సీనియర్ మహిళలు ఆస్ట్రేలియాతో ఆడే వన్డే సిరీస్ వేదికలు, సౌతాఫ్రికా-ఎ జట్టు, భారత-ఎ జట్టు మధ్య జరిగే మ్యాచ్‌ వేదికల్లో మార్పులు చేసింది.భారత సీనియర్ పురుషుల జట్టు   అక్టోబర్‌ 10 నుంచి 14 వరకూ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో వెస్టిండస్‌తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ వేదికను న్యూఢిల్లీకి బిసిసిఐ (BCCI) మార్చింది. ఆ తర్వాత నవంబర్ 14 నుంచి 18 వరకూ న్యూఢిల్లీలో సౌతాఫ్రికాతో జరగాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్‌ను కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌కి తరలించారు. వేదికలు మారిన మ్యాచ్‌లు మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. ఇక భారత సీనియర్ మహిళల జట్టు సెప్టెంబర్‌ 14, 17, 20 తేదీల్లో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ, చిదంబరం స్టేడియంలో రిపేర్లు జరుగుతున్న కారణంగా తొలి రెండు వన్డేలు న్యూ చండీఘడ్‌లోని పిసిఎ స్టేడియంకు, చివరి వన్డే న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు మార్చారు.సౌతాఫ్రికా పురుషుల-ఎ టీం నవంబర్ 13, 16, 19 తేదీల్లో భారత్-ఎ జట్టుతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ చిన్నస్వామి స్టేడియం నుంచి రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు మార్చారు.