11 ఏళ్లలో ఎంతో సాధించాం.. సాధించాల్సింది ఎంతో ఉంది
11 ఏళ్లలో ఎంతో సాధించాం..
సాధించాల్సింది ఎంతో ఉంది
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్ :
2014 మే 26.. సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు భారత దేశ ప్రధాన మంత్రిగా తొలిసారి నరేంద్ర మోదీ ప్రమాణాస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పాలన నిరాంటంకంగా కొనసాగుతోంది. 2014, 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో.. అఖండ విజయాలను నమోదు చేసి.. వరుసగా మూడు సార్లు ప్రధాని పదవిని స్వీకరించారు. అప్రతిహతంగా దూసుకెళ్తున్న మోదీ పాలన నేటితో 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రా, ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక కాలం ఈ దేశానికి సేవలందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ పేరు చిరస్థాయిగా చిలిచిపోనుంది. ఇంత పెద్ద ఘనత సాధించిన ప్రధాని మోదీ.. తన ఈ 11 ఏళ్ల పాలనలో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించింది. యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అని గర్వంలో ప్రతి భారతీయుడు చెప్పుకోవచ్చు.
2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాలకోట్ వైమానిక దాడి ఆయన నాయకత్వంలో భారత్ బలమేంటో ప్రపంచానికి తెలిసొచ్చింది దేశ పౌరులపై పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలను పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి మరీ కూల్చాం. ఆపరేషన్ సిందూర్‌తో ఈ ప్రపంచానికి భారత సైనిక శక్తి గురించి చాటిచెప్పాం. ఈ సాహసోపేతమైన చర్యలు భారతదేశ ప్రతిష్టను పెంచాయి.మోడీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ పరివర్తన, వ్యాపార సౌలభ్యానికి అపూర్వమైన ప్రాధాన్యతనిచ్చింది. భారత్‌మాల హైవే నెట్‌వర్క్, స్మార్ట్ సిటీలు, రైలు, వాయు కనెక్టివి వేగవంతమైన విస్తరణ వంటి ప్రాజెక్టులు భారతదేశ స్థాయిని పెంచడంలో దోహదపడ్డాయి. GST, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల అమలు వంటి వ్యూహాత్మక ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షించాయి.నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం.. గత తొమ్మిదేళ్లలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. ఆయుష్మాన్ భారత్ నిర్వహణకు భారతదేశం వేదిక అయింది. 50 కోట్ల మంది భారతీయులకు వర్తించే ఈ ఆయుష్మాన్ భారత్ పేదలకు, మధ్యతరగతి ప్రజలకు భరించగల స్థాయిలో నాణ్యమైన వైద్యసేవలను సమకూర్చుతుంది. ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన ద్వారా అవ్యవస్థీకృత రంగంలో 42 కోట్ల మందికి పైగా పింఛన్ అందించారు. యావత్తు ప్రపంచం సంవత్సరంలో ఒక రోజును “అంతర్జాతీయ యోగ దినం’’ గా పాటించాలన్న మోదీ పిలుపునకు ఐక్య రాజ్య సమితిలో అద్భుత స్పందన వచ్చింది. ప్రతి సంవత్సరంలో జూన్ 21వ తేదీని “ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ యోగ దినం”గా పాటించాలన్న తీర్మానాన్ని177 సభ్యత్వ దేశాలు ముక్తకంఠంతో ఆమోదించాయి. 17 సంవత్సరాల అనంతరం నేపాల్, 28 సంవత్సరాల అనంతరం ఆస్ట్రేలియా, 31 సంవత్సరాల అనంతరం ఫిజీ, 34 సంవత్సరాల అనంతరం సెశెల్స్, యుఎఇ లలో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధాన మంత్రిగా మోదీ నిలిచారు. తొలి సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మోదీ.. ఐక్య రాజ్య సమితి, బిఆర్ ఐసిఎస్ (బ్రిక్స్), సార్క్, జి-20 శిఖరాగ్ర సమావేశాల లో పాల్గొన్నారు.ప్రధాన మంత్రి మోదీకి ఎన్నో అంతర్జాతీయ అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. సౌదీ అరేబియా ఆయన కు తమ అత్యున్నత పౌర పురస్కారం సాష్ ఆఫ్ కింగ్ అబ్దులజీజ్ తో సత్కరించింది. మోదీకి అత్యున్నత పౌర పురస్కారాలను ప్రదానం చేసిన వివిధ దేశాలలో రష్యా (ద ఆర్డర్ ఆఫ్ హోలీ ఆపాస్సల్ యాండ్రూ ద ఫస్ట్), పాలస్తీనా (గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్), అఫ్గానిస్తాన్ (అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డ్), యుఎఇ (జయేద్ మెడల్), మాల్దీవ్స్ (రూల్ ఆఫ్ నిశాన్ ఇజ్జుద్దీన్) లు ఉన్నాయి. శాంతికి, అభివృద్ధికి చేస్తున్న కృషి కి గుర్తింపుగా మోదీ 2018 లో ప్రతిష్ఠాత్మకమైన సియోల్ శాంతి బహుమతిని అందుకొన్నారు.