Cyber Crime | లింక్ క్లిక్ చేయగానే.. 3 లక్షలు కాజేశారు
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఓ వివాహితను బ్లాక్‌మెయిల్ చేసి.. రూ. 3 లక్షలు కాజేశారు. గృహిణికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం వచ్చింది. ఆ లింక్‌ను క్లిక్ చేయగానే..మొబైల్‌కు ఓటీపీ వచ్చింది. ఆ నంబర్‌లో నమోదు చేయడంతో సైబర్‌నేరగాళ్లు ఆ ఫోన్‌ను హ్యాక్ చేశారు.
ఈ క్రమంలో కొన్ని రోజులకు ఆమె ఫోన్‌కు నగ్న ఫొటోలు వచ్చాయి. ‘ఈ ఫొటోలను నీ ఫోన్‌లోని కాంటాక్ట్‌లో ఉన్న వారందరికీ పంపిస్తామం’టూ నిందితులు బెదిరించారు. పలు దఫాలుగా డబ్బులు వసూలు చేశారు. వాట్సాప్ నుంచి ఆ ఫొటోలు డిలీట్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ.. తనను బెదిరిస్తున్నారంటూ.. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేపట్టారు.