శ్రీ లక్ష్మణేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా

శ్రీ లక్ష్మణేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా

శ్రీ లక్ష్మణేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

అమావాస్యను పురస్కరించుకుని  శివగంగానగర్​ శ్రీ లక్ష్మణేశ్వర స్వామి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం లాల్ దర్వాజా గౌలిపుర  ఆధ్వర్యంలో బుధవారం భక్తి శ్రద్దలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం గోశాలలోని గోవులకు గోగ్రసం తినిపించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా ముఖ్య అతిధిగా పాల్గొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా గోశాల లోని గోవుల గోగ్రాసం కోసం రూ.20వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్​ ఆలె జితేంద్ర, ఆలయ చైర్మన్​ దామోదర్​ రెడ్డి, కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ చైర్మన్ చీల రాములు గుప్తా,  గుగ్గిల అశోక్ కుమార్, సరాబు విశ్వేశ్వరయ్య, కొర్ల వెంకటేష్, సంఘ అధ్యక్షులు సరాబు సంతోష్ కుమార్, సంఘ ప్రధాన కార్యదర్శి గుబ్బ శ్రీనివాస్​, సంఘం సభ్యులు బూర్గు కుమార్, బనస రవికుమార్, పూల జగన్నాథం, సిరంగి సంతోష్ కుమార్, గౌరీశెట్టి విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు.