ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్ట, జూన్ 30 ;: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానం శాశ్వత నిత్య అన్నదాన పథకానికి భారీ స్పందన లభిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా తీర్చిదిద్దేందుకు కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు చేస్తున్న కృషికి మంచి స్పందన లభిస్తోంది. హైద్రాబాద్ కొండాపూర్ కు చెందిన భూపతిరాజు సూర్యనారాయణరాజు వారి మనవడు అనంత్ ఇషాన్ పేరున శ్రీ స్వామి వారి శాశ్వత నిత్య అన్నదాన పథకానికి 25 లక్షల రూపాయల విరాళం చెక్కును కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు కు అందజేశారు. విరాళాల దాతలను ప్రోత్సహించేందుకు దేవస్థానం ప్రత్యేక పథకాలు రూపొందించాలని, తద్వారా భక్తులకు మరిన్ని సౌకర్యాలు సమకూరుతాయని, దేవస్థానం త్వరితగతిన మరింత అభివృద్ధి చెందుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.