రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం : హరీష్ రావు
రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం : హరీష్ రావు
*ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసే దాకా, ఉసిగొలిపిన సీఐ, ఏసీపీని సస్పెండ్ చేసేదాకా ఇక్కడి సీపీ ఆఫీస్ నుండి కదిలేది లేదు.
*కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
*లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే సీపీ, డీజీపీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి.
*పోరాడి, దెబ్బలు తిని రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఇలాంటి దాడులకు భయపడం.
*అధికారం శాశ్వతం కాదు.. పోలీస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాం
*ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మీద జరిగిన దాడిపై సైబరాబాద్ జాయింట్ సీపీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు
*పోలీసుల వైఫల్యం వల్లే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది
*ఇందుకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
*పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నార్సింగి పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేస్తున్నారు
*ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి న్యాయం జరగాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాలని కోరుతున్నాం
*హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినొద్దు అని మేం కోరుకుంటున్నాం
*గతంలో తెలంగాణ పోలీసులు దేశానికి రోల్ మోడల్‌గా ఉన్నారు
*సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోలీసులను తమ పని తమను చేసుకోనివ్వడం లేదు
*పోలీసులను వాళ్ల అక్రమాలకు, అరాచకాలకు, అక్రమ కేసులకు వాడుకుంటున్నారు. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
*ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసులకు 1వ తేదీన జీతాలు ఇస్తామన్నారు
*సైబరాబాద్ పరిధిలో 1200 మంది హోంగార్డులు ఉన్నారు. 12వ తేదీ వచ్చినా హోంగార్డులకు జీతాలు ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం
*పోలీసులకు టీఏలు, డీఏలు రిలీజ్ అవట్లేదు. కానిస్టేబుళ్లకు సరెండర్ లీవ్ డబ్బులు ఇవ్వట్లేదు
*కాంట్రాక్టర్లకు వందల కోట్ల డబ్బులిస్తున్నారు
*కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
*లేదంటే సీబీఐ విచారణ కోరుతాం, అవసరమైతే కోర్టుకు వెళ్తాం, కేంద్ర హోంశాఖ వద్దకు వెళ్తాం. నిజనిజాలు బయటకు రావాలి
*రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది
*ఈ దాడి వెనుక పాత్రదారులెవరు? సూత్రదారులెవరు? సహకరించింది ఎవరో అన్నీ బయటకు రావాలి
*లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే సీపీ, డీజీపీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేయండి
*ఈ దాడిని దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను సస్పెండ్ చేయాలి
*రాళ్లు, కత్తులు, కర్రలతో కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు
*రాష్ట్ర ప్రజలంతా గమనించారు, టీవీల్లో ప్రజలు చూస్తున్నారు
*పదేండ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్నాం
*సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు
*సైబరాబాద్ పోలీసులంటే ఒక మంచి ఇమెజ్ ఉండే.. దాన్ని రేవంత్‌రెడ్డి మంటగలిపిండు
*రేవంత్ నిన్ను హెచ్చరిస్తున్నా.. దాడి చేసిన గుండాలను అరెస్ట్ చెయ్.. వారికి సహకరించిన పోలీసులపై యాక్షన్ తీసుకో
*లేకపోతే ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ముందు, ఏఐసీసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం.
*రాహుల్‌గాంధీ రాజ్యాంగం చేతులో పట్టుకొని తిరగడం కాదు.. కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నరో దేశం మొత్తం తెలిసేలా చేస్తాం.
*రాహుల్ గాంధీకి నిజాయితీ లేదు.. ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని చెప్పాలని తెలీదా. చేర్చుకున్నా వారిని రాజీనామా చేయాలని చెప్పొద్దా?
*సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు.
*ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేసేందుకు వెళ్తే అక్కడ దాడి చేశారు.
*నల్గొండ జిల్లాలో మాపై దాడి చేశారు.
*కానీ, ఇప్పటి వరకు ఆ గూండాలపై చర్యలు తీసుకోలేదు.
*కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన గుండాలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో రాచ మర్యాదలు చేస్తున్నారు.
*లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు మేము ప్రతి దాడులు చేయడం లేదు.
*పోరాడి, దెబ్బలు తిని రాష్ట్రాన్ని సాధించుకున్నం ఇలాంటి దాడులకు భయపడం.
*గుండాలు, సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టం.
*2014లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జానారెడ్డిని ఆరోజు పీఏసీ చైర్మన్ పేరు ఇవ్వాలని నేను కోరాను. నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి పేరు ఇస్తే మేము పీఏసీ చైర్మన్‌గా అపాయింట్ చేసాం. వారు చనిపోతే పాలేరు ఎమ్మెల్యే రామ్‌రెడ్డి వెంకట్ రెడ్డి పేరు ఇస్తే వారిని కూడా పీఏసీగా నామినేట్ చేసాం. తర్వాత గీతా రెడ్డి పేరు ఇస్తే వారిని పీఏసీ చైర్మన్‌గా అపాయింట్ చేసాం.
*2018లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల ప్రతిపక్ష హోదా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కి పీఏసీ చైర్మన్ ఇచ్చాము.