గోల్కొండలో బోనాల సందడి షురూ

గోల్కొండలో బోనాల సందడి షురూ

గోల్కొండలో బోనాల సందడి షురూ

బోనాల ఉత్సవాల సందర్భంగా తొలి బోనం సమర్పించిన మంత్రులు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు - 2025 ప్రారంభోత్సవం సందర్భంగా  లంగర్ హౌజ్ చౌరస్తా లో  గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ,మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించి ,అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనం సమర్పించారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన ,సిపి సివి ఆనంద్ ,కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్,ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్,ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముందుగా ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ సాంప్రదాయాలు ఆచారాలు ప్రపంచస్థాయిలో గుర్తించదగిన ఆషాఢ మాస బోనాలు. ఈరోజు తొలి బోనం గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు,అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది.. రేవంత్ రెడ్డి  నాయకత్వంలో కేబినెట్ మొత్తం ప్రభుత్వం తరుపున ముఖ్యమైన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. హైదరాబాద్ ప్రజలు వచ్చే భక్తులకు మంచి ఆతిధ్యం ఇచ్చేలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. బోనాల పండగ సందర్భంగా 3 వేల దేవాలయాలకు పండగ కోసం 20 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం కేటాయించింది. నెల రోజుల పాటు వివిధ ఆలయాల్లో బోనాలు సమర్పిస్తూ రంగం కార్యక్రమాలు ఉంటాయి. ఆ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం సంవృద్ధి వర్షాలతో పాడి పంటలతో అందరూ ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేసుకుంటున్నానని చెప్పారు.