చారిత్రక నగరాల అధ్యయనం ఆసక్తిదాయకం

చారిత్రక నగరాల అధ్యయనం ఆసక్తిదాయకం

చారిత్రక నగరాల అధ్యయనం ఆసక్తిదాయకం

 ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

భారతదేశంలో అతి పురాతన, చారిత్రక నగరాలలో ఒకటైన హైదరాబాద్ గొప్ప సంస్కృతికి చిరునామా అని సీనియర్ ఆర్కిటెక్ట్ తాన్యా శ్రీవాత్సవ అన్నారు.  ఈ నగర చరిత్రను తెలుసుకోవటం విద్యార్థులకు, పర్యటకులకే కాక అందరికీ ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. పర్యటక వారోత్సవాలలో భాగంగా సిటీ కళాశాల టూరిజం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆమో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గోల్కొండ నుండి హైదరాబాద్ వరకు,  కాకతీయులు, బహమనీలు, మొఘలులు,  అసఫ్జాహీలతో సహా వివిధ రాజవంశాలచే ప్రభావితమైన నిర్మాణ శైలుల విశిష్టతను ఆమె వివరించారు. ఇండో-పర్షియన్, యూరోపియన్,  ఇండో-యూరోపియన్,  ఇండో-సార్శనిక్ శైలిలో ఉన్న నగరంలోని వారసత్వ కట్టడాలు పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తాయని అన్నారు. అనంతరం ఐజాజ్ సుల్తానా మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి దేశవిదేశాల నుండి పర్యటకులు వస్తారని, ఇక్కడి రుచులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, నగరంలోని వివిధ ప్రదేశాల పేర్లకు సంబంధించిన చరిత్రను తెలుసుకోవటం కూడా విజ్ఞానదాయకంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐక్యూఏసి కోఆర్డినేటర్ డా.నీరజ మాట్లాడుతూ బిబిఏ టూరిజం విద్యార్థులకు క్షేత్ర స్థాయి అవగాహన కోసం వివిధ విద్యార్థి కేంద్రక కార్యక్రమాలను ఈ వారమంతా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు సదస్సుతో పాటు న్యూట్రిషన్ విద్యార్థులు తెలంగాణ ప్రత్యేక వంటకాలను తయారుచేసి అధ్యాపకులకు, తోటి విద్యార్థులకు రుచి చూపించారని అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న రాజనీతి శాస్త్ర అధ్యాపకులు డా.భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచమంతా కుగ్రామంగా మారి గుప్పెట్లోకి వచ్చిందని, ఇప్పుడు విద్యార్థులు ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న ప్రదేశాల గురించైనా తెలుసుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో కామర్స్ మేనేజ్మెంట్ విభాగం అధ్యక్షులు డా.మల్లికార్జున్,సుమన యాదగిరి, డా.రవీంద్ర బాబు, నేహా, నరేష్ తదితరులు పాల్గొన్నారు.