జాతీయోద్యమ స్ఫూర్తినందిస్తున్న భాష- హిందీ భాష
జాతీయోద్యమ స్ఫూర్తినందిస్తున్న భాష- హిందీ భాష
సిటీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. విప్లవ్ దత్ శుక్లా
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
ప్రభుత్వ సిటీ కళాశాలలో హిందీ దివస్ వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. విప్లవ్ దత్ శుక్లా ఆధ్వర్యంలో జరిగిన ముగింపు సభకు ఉర్దూ విభాగం అధ్యక్షులు డా. సయ్యద్ అస్రార్-అల్-హక్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందీ పక్షం సందర్భంగా విద్యార్థులకు హిందీ భాషా సాహిత్యాలపై వివిధ పోటీలు నిర్వహించారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్ డా.విప్లవ్ దత్ శుక్లా మాట్లాడుతూ భారత రాజ్యాంగ సభ ద్వారా హిందీని అధికారిక భాషగా స్వీకరించిన రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవం జరుపుకుంటామని, భారత జాతీయోద్యమంలో సాధారణ ప్రజలందరిని ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఎంతో తోడ్పడిందని గుర్తు చేశారు. హిందీ విభాగాధిపతి డా.రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ ఒక్క భారతదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషలలో హిందీ మూడవదని, ఆయా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయటం భాష ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. అనంతరం డా. సయ్యద్ అస్రార్ విజేతలకు బహుమతులు అందించారు. హిందీ కవితా రచనలో అస్రా బేగం ప్రథమ, జ్యోతి కుమారి ద్వితీయ, జీనత్ పర్వీన్ తృతీయ స్థానంలో నిలిచారు.వ్యాస రచనలో బి.ఇ రమేష్ ప్రథమ, కృపా లత ద్వితీయ, మెహరాజ్ ఖాన్ తృతీయ స్థానంలో నిలిచారు. పోస్టర్ పెయింటింగ్‌లో రాఖీ కుమారి మొదటి స్థానంలో నిలవగా, జ్యోతి కుమారి రెండో స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో హిందీ విభాగం సహాచార్యులు డా. యువరాజ్ ధావన్ తదితరులు పాల్గొన్నారు.