చెరువు కట్టపై నుంచి పడి ఏనుగు మృతి

చెరువు కట్టపై నుంచి పడి ఏనుగు మృతి

చెరువు కట్టపై నుంచి పడి ఏనుగు మృతి
ప్రజా క్షేత్ర్, చిత్తూరు :
పుంగనూరు పులిచెర్ల(మం) పెద్దఒడ్డు సమీపంలో చెరువు కట్టపై నుంచి జారి పడి ఏనుగు మృతి చెందింది. గత కొద్దిరోజులుగా పులిచెర్ల కొండ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి కల్లూరు సమీపంలోకి ఏనుగుల గుంపు వచ్చింది. ఏనుగు మృతి సమాచారం తెలియగానే అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పులిచెర్ల(మం)పాత పేట అటవీ ప్రాంతంలో  ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు సమాచారం.  ఏనుగుల గుంపు మామిడి,అరటి,టమోటా తోటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. ఏనుగుల దాడిలో తమ పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులు  రోధిస్తున్నారు. పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని  కోరుతున్నారు.