వినియోగదారుల హక్కులను కాపాడడమే వినియోగదారుల కోర్టు లక్ష్యం : జస్టిస్ ఎమ్మెస్ కే జయశ్వాల్

వినియోగదారుల హక్కులను కాపాడడమే వినియోగదారుల కోర్టు లక్ష్యం  : జస్టిస్ ఎమ్మెస్ కే జయశ్వాల్

వినియోగదారుల హక్కులను కాపాడడమే వినియోగదారుల కోర్టు లక్ష్యం

జస్టిస్ ఎమ్మెస్ కే జయశ్వాల్

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

హైదరాబాద్ బర్కత్ పుర లో తెలంగాణ అఖిలభారత గ్రాహక్ పంచాయతీ సాధారణ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వినియోగదారుల కోర్టు జస్టిస్ ఎమ్మెస్ కే జయశ్వాల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా 2024 - 2025 సంవత్సరానికి గాను ఆదాయ వ్యయం వివరాలను తెలంగాణ ప్రాంత కోశాధికారి డి మాణిక్ రావు  ఈ సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా జస్టిస్ ఎమ్మెస్ కె  జయస్వాల్  మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను రక్షించడంతో పాటు వారికి న్యాయం అందించడమే వినియోగదారుల కోర్టు లక్ష్యం అన్నారు. వినియోగదారుల హక్కులను కాపాడటానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. వ్యాపారి చేత మోసగించబడి, తన హక్కులను కోల్పోయిన ఏ వినియోగదారుడైనా ఈ చట్టం కింద వ్యాపారిపై ఫిర్యాదు చేయవచ్చని, కేసు దాఖలు చేయడానికి వినియోగదారుడి వద్ద సరైన పత్రాలు ఉండాలన్నారు. వినియోగదారుల హక్కులుఉల్లంఘించబడినప్పుడల్లా పరిహారం కోరే హక్కు ఉంటుందన్నారు. అలాగే  సమాజంలో స్వచ్ఛంద సంస్థ అయినటువంటి గ్రాహక్ పంచాయతీ సేవలను గుర్తించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రాంత అధ్యక్షులు బండి నరేష్, దక్షిణ క్షేత్ర సంఘటన మంత్రి నది దత్తాత్రేజీ, తెలంగాణ అఖిల భారత గ్రామపంచాయతీ ఇన్చార్జ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.