నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీరు దిగువకు విదుదల
నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీరు దిగువకు విదుదల
@ నాగార్జునసాగర్ ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారిగా 18 సంవత్సరాల తర్వాత జూలై నెలలోనే సాగునీటి విడుదల
@ నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఒక ఆధునిక దేవాలయం
@ రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఆధునికరిస్తాము. పూడిక తీస్తాం-రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ప్రజా క్షేత్ర్, నన్నగొండ జూలై 29 :
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునికరిస్తామని,అలాగే పూడిక తీస్తామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ ,మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి, నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఒక ఆధునిక దేవాలయం అని అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల లోని 22 లక్షల ఎకరాలకు సాగునీరుతుందని చెప్పారు .జవహర్ కుడి కాలువ ద్వారా 11.74 లక్షల ఎకరాలు, లాల్ బహుదూర్ ఎడమ కాలువ ద్వారా 10.38 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 6 లక్షల 50వేల ఎకరాలకు సాగు నీరు అందుతుండగా, నల్గొండ జిల్లాలో 1,50,000 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో రెండు లక్షల 30 వేల ఎకరాలు ,ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్ష ఎకరాలకు ఆయకట్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరండుతున్నదని తెలిపారు. 2005 సంవత్సరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్వర్ణోత్సవాలు. నిర్వహించడం జరిగిందని చెప్పారు.తను ఆరుసార్లు శాసనసభ్యుడిగా,ఒకసారి పార్లమెంటు సభ్యునిగా ఉంటూ ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు మంత్రిగా నాగార్జున సాగర్ ద్వారా నీటిని వదలడం సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గత వానాకాలం,యాసంగి , వానాకాలం కలిసి రెండు లక్షల 81 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని. పండించడం జరిగిందని, ఇందులో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పాత్ర ముఖ్యమని అన్నారు.సాగునీటితో పాటు నాగార్జునసాగర్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా గడచిన 4 రోజులుగా 30000 క్యూసెక్కుల నీటిని తో పూర్తిస్థాయిలో,700 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామన్నారు.