ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన కేటీఆర్

ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన కేటీఆర్

ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన కేటీఆర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో దవాఖానలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పల్లా రాజేశ్వర్ తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం  బాగానే కోలుకుంటున్నట్లు  పల్లా రాజేశ్వర్ తెలిపారు. పల్లా రాజేశ్వర్  వేగంగా కోలుకుని, త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలో యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీర్  ఆకాంక్షించారు. కేటీఆర్  వెంట మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,  పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు