కెసిఆర్, కెటిఆర్‌ లకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదు : టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్

కెసిఆర్, కెటిఆర్‌ లకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదు : టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్

కెసిఆర్కెటిఆర్‌ లకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదు

                  టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్  

 ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 29 ;:

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్   బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై విరుచుకుపడ్డారు. వీరిద్దరికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదని ఆయన అన్నారు. ఓ మీడియా ఛానెల్‌పై బిఆర్‌ఎస్ శ్రేణులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సినీతారల ఫోన్లు ట్యాపింగ్ చేయడం ద్వారా వాళ్ల కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ తారలుజడ్జిలుమహిళ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఆరోపించారు. వాళ్ల టార్గెట్ రాజకీయ నేతలు అయితే.. వాళ్ల ఇంట్లో ఉన్న మహిళల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశఆరని ప్రశ్నించారు. ఈ విషయంలో ఏదైనా అభ్యంతరం ఉంటే న్యాయపరంగా ముందుకు వెళ్లాలని సూచించారు.