నడిరోడ్డుపై హద్దులు దాటిన ముద్దులు

నడిరోడ్డుపై హద్దులు దాటిన ముద్దులు

నడిరోడ్డుపై హద్దులు దాటిన ముద్దులు 

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

నడిరోడ్డు పై  ప్రేమికులు వికృతచేష్టలకు పాల్పడుతున్నారు....తాము నడిరోడ్డుపై ఉన్నామన్నధ్యాసనే మరిచారు...ఏకంగా బైక్ పై ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ ముద్దులు పెట్టుకుంటున్న చిత్రాలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. ఇదంతా హైదరాబాద్ నగర శివార్లలోని పహాడీషరీఫ్ ప్రధాన రహదారిలో ఓ ప్రేమికుల జంట బైక్‌పై వెళ్తూ కెమెరాకు చిక్కింది. రోడ్డు మీద ఉన్నామన్న సంగతి మరిచారు. ఏకంగా బైక్​ వెనుక సీటులో సదరు యువతి కూర్చోకుండా బైక్​  పెట్రోల్​ ట్యాంక్​ పై భాగంలో రివర్స్​ కూర్చొని ప్రేమికునికి ముద్దులు వర్షం కురిపించింది. పక్కన వెళ్తున్న తోటి వాహాదారులు ఏం మాయ రోగం అంటూ సిగ్గుతో తలదించుకున్నారు. ఆ ముద్దులకు  అతను రయి....రయిమంటూ రోడ్డుపై దూసుకెళ్ళే చిత్రం కెమెరా కంటపడింది.  వారిద్దరి భాగోతం వెలుగు లోకి వచ్చింది. దీంతో రోడ్డు పై న్యూసెన్స్​ చేసిన ఆ జంట ఆచూకీ  కోసం పోలీసులు ఆరాతీస్తున్నారు.