బీజేపీ ఫ్యూడల్ పార్టీ.. బీజేపీ లో బీసీ లకు ఎప్పుడూ న్యాయం జరగలేదు : మంత్రి పొన్నం ప్రభాకర్

బీజేపీ ఫ్యూడల్ పార్టీ..  బీజేపీ లో బీసీ లకు ఎప్పుడూ న్యాయం జరగలేదు : మంత్రి పొన్నం ప్రభాకర్

బీజేపీ ఫ్యూడల్ పార్టీ..  బీజేపీ లో బీసీ లకు ఎప్పుడూ న్యాయం జరగలేదు

* ఒక బీసీ నాయకుడు  నామినేషన్ వేయనివకుండా అడ్డుకొని నిరంకుశత్వంగా వ్యవహరించారు..

* బీజేపీ పార్టీ బీసీ ల వ్యతిరేకి అని మరోసారి  నిరూపించుకుంది..

* బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్,

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 30 ;బీజేపీ పార్టీ బీసీ ల వ్యతిరేకి అని మరోసారి  నిరూపించుకుందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.ముగ్గురు బీసీ ఎంపీలు ఉన్న బీసీ సీనియర్ నేతలు ఉన్న  బీజేపీ అధ్యక్షుడు   కావడానికి అన్ని అర్హతలు ఉన్న ఇవ్వలేదు,గతంలో బీసీ ముఖ్యమంత్రి  చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి కనీసం సభాపక్ష నాయకుడు ని కూడా బీసీ లకు ఇవ్వలేదు బీజేపీ ఫ్యూడల్ పార్టీ..  బీజేపీ లో బీసీ లకు ఎప్పుడూ న్యాయం జరగలేదన్నారు.బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ నాయకుడు  నామినేషన్ వేయనివకుండా అడ్డుకొని నిరంకుశత్వంగా వ్యవహరించారు.. ఆయన మద్దతుదారులను భయబ్రాంతులకు గురి చేశారు..బీజేపీ లో బీసీ లకు  అన్యాయం జరుగుతుందని మీ పార్టీ నాయకులే వాపోతున్నారు.. దీనికి బీజేపీ అధిష్టానం ఏం సమాధానం చెప్తుంది..సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం..బీసీ ల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీముఖ్యమంత్రి రెడ్డి ఉంటే... పీసీసీ అధ్యక్షుడిని బీసీ నీ చేసుకున్నాంమేము ఒకవైపు కుల గణన చేసుకొని బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చేస్తూ  శాసన సభలో చట్టం చేసుకొని సామాజిక న్యాయం కోసం ముందుకు పోతుంటే..బీజేపీ మరోసారి బీసీ ల  గొంతు కోసింది..దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ  బీసీ ల కోసం నినాదాన్ని ఎత్తుకున్నారుతెలంగాణలో దేశ వ్యాప్తంగా ఎస్సీఎస్టీబీసీ,మైనార్టీ లకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యంగతంలో బీజేపీ అధ్యక్షుడు బీసీ నేత బండి సంజయ్ ఉంటే ఎన్నికల సమయంలో ఆయనను తొలగించి  కిషన్ రెడ్డి ని అధ్యక్షుడిని చేశారు..