మహిళలు, చిన్నారుల సంరక్షణ కొరకు "శక్తి"వంతమైన యాప్.....
మహిళలు, చిన్నారుల సంరక్షణ కొరకు "శక్తి"వంతమైన యాప్.....
శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోండి... ఆపదనుండి రక్షణ పొందండి.....
ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
ప్రజా క్షేత్ర్, నంద్యాల :
జిల్లాలో మహిళలు మరియు చిన్నారుల సంరక్షణార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన శక్తి యాప్ సేవలను నంద్యాల జిల్లాలోని మహిళలు, చిన్నారులకు అందించుటకు ఎస్సై/ఏ ఎస్సై స్థాయి అధికారితో ఒక్కో బృందంలో 06 మంది పోలీసు సిబ్బంది, అధికారులు ఉండేట్లు 06 శక్తి పోలీస్ బృందాలను జిల్లలో పనిచేయుచున్నాయి. అందులో భాగంగా ఆళ్లగడ్డ, ఆత్మకూరు,డోన్ ,పోలీస్ సబ్ డివిజన్లలో ఒక్కో బృందం పని చేస్తుందని, నంద్యాల కు సంబంధించి సబ్ డివిజన్ పరిధిలో ఒక్క బృందం, నంద్యాల హెడ్ క్వాటర్ కు సంబంధించి 2 బృందాలు పని చేస్తున్నాయి.