మేడ్చల్ లో ఎంపి ఈటల రాజేందర్ పర్యటన
మేడ్చల్ లో ఎంపి ఈటల రాజేందర్ పర్యటన
మేడ్చల్ మల్కాజిగిరి
మేడ్చల్ మండలం శ్రీ రంగవరం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించి, అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంపి మాట్లాడుతూ సిటీకి కూతవేటు దూరంలో ఉండి, మేడ్చల్ మున్సిపాలిటీలో కలపబడ్డ గ్రామాలు రావల్ కోల్ తండా, సైదోని గడ్డ తండా. ఈ తండాలో అంగన్వాడి కేంద్రాలను డ్రైనేజీ సమస్యలను పరిశీలించాను. రోడ్డు మీద నుండి లోపలికి రావడానికి లైట్లు లేవు. ఇది ఈ తండా దుస్థితి. అనేక సంవత్సరాలుగా ఈ గ్రామం మురికినీళ్ళన్నీ పంట పొలాల మీదకు పోతున్నాయి. ఆ నీళ్లు పారుతుంటే దుర్గంధంతో వరికోసే సమయంలో మిషన్లు రావడం లేదు. మురికి కాలువ సమస్యలు తీర్చాలని, తండా లోపలికి రావడానికి లైట్లు పెట్టించాలని గ్రామస్తులు కోరారు. వీళ్ళు గెలిపించిన ఎంపీగా తప్పకుండా సమస్య అతి తొందరలో పరిష్కారం చేస్తామని మాట ఇచ్చానని అన్నారు.