వారసత్వ సంపదను కాపాడుకోవాలి

వారసత్వ సంపదను కాపాడుకోవాలి

వారసత్వ సంపదను కాపాడుకోవాలి

డెక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​

చరిత్రను అన్వేషించడానికి, అధ్యయనం చేయడానికి విద్యార్థులను ప్రేరేపించడం కోసం హెరిటేజ్ వాక్ వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, వారసత్వ సంపదను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని డెక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్ అన్నారు. పర్యాటక వారోత్సవాలలో భాగంగా సిటీ కళాశాల కామర్స్ మేనేజ్మెంట్ విభాగం సిటీ కాలేజి నుండి పురాని హావేలి వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సీనియర్ ఆర్కిటెక్ట్ తాన్యా శ్రీవాత్సవ ఆధ్వర్యంలో మూడు గంటలు సాగిన ఈ నడకలో విద్యార్థులు హై కోర్టు, ఆషుర్ ఖానా, దివాన్ దేవిడి, పురాని హావేలికి సంబంధించిన అనేక విశేషాలు తెలుసుకున్నారు. ఆషుర్ ఖానా లో 400 ఏళ్ళనాటి పర్షియన్ పాలీక్రోమ్ టైల్స్‌తో పరచిన చిత్రాలు, పురాని హావేలిలో ఏర్పాటు చేసిన మ్యూజియంలోని వస్తువులు తమను ఆకట్టుకున్నాయని,  ఇలాంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించటం వల్ల తమకు కోర్సు పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.మల్లికార్జున్ రావు, డా. నీరజ, డా.ఝాన్సీ, డా.రవీంద్ర బాబు, నేహా, రాజేష్, అరుణ తదితరులు పాల్గొన్నారు.