వైభవంగా శ్రీ జమ్మలమ్మ దేవి వార్సికోత్సవ వేడుకలు

వైభవంగా శ్రీ జమ్మలమ్మ దేవి వార్సికోత్సవ వేడుకలు

వైభవంగా శ్రీ జమ్మలమ్మ దేవి వార్సికోత్సవ వేడుకలు

నది జలాలు తో అభిషేకం

వందలాది మంది మహిళలుతో బోనాలు పూజలు

ప్రజా క్షేత్ర్, ఎమ్మిగనూరు :
ఎమ్మిగనూరు పట్టణం సోగనూరు రోడ్డు లో వెలసిన శ్రీ జమ్మలమ్మ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని జమ్మలమ్మ దేవి ఆలయాన్ని ప్రారంభించి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా త్రీతీయ వార్సికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ జమ్మలమ్మ దేవి ఆలయం ధర్మకర్త, మాజీ కౌన్సిలర్, మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ తట్టే బుడ్డప్ప ఆధ్వర్యంలో  తుంగభద్ర నది కు వెళ్లి బిందెలతో నీరు తీసుకొచ్చి అమ్మ వారికి అభిషేకం చేశారు. అలాగే మహిళలు కళశాలు , బోనాలు తో అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం అన్నదానం చేపట్టారు. భక్తులు వేలాదిగా తరలిరావడంతో దేవాలయం పరిసరాలు కిటకిటలడాయి. కార్యక్రమంలో శ్రీ జమ్మలమ్మ దేవి ఆలయ కమిటీ సభ్యులు మాడుగుండు నీలకంఠప్ప, బుగుడే తిమ్మప్ప, మరిడి దుష్యంత్, బుగుడే శ్రీనివాసులు,ఛాయ శ్రీనివాసులు, మాదుగుండు రంగస్వామి, బండ ఏకంబరి, మోనే రాఘవేంద్ర తో పాటు తట్టే ఆదినారాయణ ,తట్టే అనిల్ కుమార్, భక్తులు పాల్గొన్నారు.