హైడ్రా ఆఫీస్ ను కూల్చేయండి: హరీశ్ రావు
Brs
హైడ్రా ఆఫీస్ ను కూల్చేయండి: హరీశ్ రావు
ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్ లోని బుద్ధ భవన్ నాలా కింద ఉన్న హైడ్రా ఆఫీస్ ను కమిషనర్ రంగనాథ్ ముందుగా కూల్చి వేయాలని ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అందరికీ ఒకే రూల్ ఉండాలని అయన అన్నారు. నెక్లెస్ రోడ్డులోని ప్రైవేట్, కమర్షియల్ షాపులు, తదితర వాణిజ్య భవనాలు హుస్సేన్ సాగర్ ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్నాయని వాటిని కూలగొడతారా? అని ప్రశ్నించారు. కొందరివి డైరెక్ట్ గా కూలగొట్టి, మరికొందరికి నోటీసులిచ్చి టైం పాస్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.