రేవంత్ రెడ్డి ని కలిసిన స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్
రేవంత్ రెడ్డి ని కలిసిన స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్
ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో
స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్ (Juan Antonio March Pujol) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలపై జువాన్ ఆసక్తి కనబర్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్పెయిన్ దేశాన్ని సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జువాన్ రాసిన 'Momentum' పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. భేటీలో ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.