ఘనంగా ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం 12 వ వార్షికోత్సవ వేడుకలు
ఘనంగా ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం 12 వ వార్షికోత్సవ వేడుకలు
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం 12 వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ జనగామ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 5 గంటలకు సుప్ర భాత సేవ, గోపూజతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, రక్షా బంధన్, పుణ్యాహవచనం, అంకురారోపణ,అఖండ దీపస్థాపన, అష్టోత్తర శత కళశ పుష్కర మహా కుంభ అభిషేకం, ధ్వజా రోహణం, శిఖర అభిషేకం, మండప ఆరాధన, యాగ శాల ప్రవేశం, అనంతరం గణపతి, నవగ్రహ, దుర్గ, రుద్ర సహిత స్థాపితా దేవతా హోమాలు, మహా పూర్ణా హుతి, అలంకరణ తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బి. సురేందర్ ముదిరాజ్, భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రధాన కార్యదర్శి కె. గురునాథ్ రెడ్డి, గౌలిపుర శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షులు కైలాష్ గంగపుత్ర, లాల్ దర్వాజా సింహావాహిని మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షులు బద్రీనాథ్ గౌడ్, వివిధ ఆలయాల ప్రతినిధులు బి వై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.