ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్ల తో సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రయోగం
ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్ల తో సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రయోగం (యూనిఫామ్ నమూనా చిత్రాలు)
ప్రజాక్షేత్ర్,, తెలంగాణ బ్యూరో
హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్ లను వలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోమ్ గార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోం గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి కొంతమేరకు ఉపాధి కల్పించినట్లవుతుందని అన్నారు. అందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. వారం, పది రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని చెప్పారు. విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు.