దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 30 నుంచి లాల్ దర్వాజ బోనాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 30 నుంచి లాల్ దర్వాజ బోనాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 30 నుంచి లాల్ దర్వాజ బోనాలు

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్ లో గత 10 సంత్సరాల నుండి లాల్ దర్వాజా సింహావాహిని మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాలు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని  ఆలయకమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్, కన్వీనర్ అరవింద్ కూమర్ లు తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వారు వివరాలు వెల్లడించారు.ఈ సంవత్సరం 11వ బోనాల ఉత్సవాల సందర్బంగా జూన్ 30, జులై 1. 2 తేదీలలో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయని తెలిపారు. సోమవారము 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఫోటో ఎగ్జిబిషన్ ను పలువురు ప్రముఖులు విచ్చేసి ప్రారంభిస్తారని, మంగళవారం 1వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఇండియా గేటి నుండి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకుని వచ్చి తెలంగాణ భవన్ ప్రతిష్టిస్తారన్నారు. బుధవారం 2వ తేదీన ఉదయం 11 గంటలకు పోతరాజు స్వాగతం, బోనాల సమర్పణ, పలువురు ప్రముఖులు విచ్చేసి, అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 6 గం॥లకు అంబేడ్కర్ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమము జరుగనున్నట్లు వారు పేర్కొన్నారు.