ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం నేతలు

ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం నేతలు

ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం నేతలు 

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :

తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సంఘం నాయకులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని కలిసి ప్రభుత్వ నిర్ణయంపై వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు తో పాటు పలువురు బీసీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.