*విజయవాడలో తెలంగాణ బోనాల జాతర సందడి*
*విజయవాడలో తెలంగాణ బోనాల జాతర సందడి*
*ఇంద్ర కీలాద్రి శ్రీ కనక దుర్గమ్మకు బంగారు బోనం*
*సమర్పించిన భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల కమిటి*
*హాజరయిన ఎపి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి*,*ఆలయ ఈ ఓ శ్రీను నాయక్*
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
విజయవాడ ఇంద్ర కీలాద్రి పై తెలంగాణ బోనాల జాతర ఘట్టం ప్రతిభింబించింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ బోనాల జాతర కొత్త శోభను సంతరించుకుంది. ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. సప్తమాత్రులకు సప్త బంగారుబోనం సమర్పణలో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడిదేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, కనక దుర్గ దేవాలయం ఈ వో శీను నాయక్ లు పాల్గొన్నారు. హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శనివారం విజయవాడకు బయలుదేరారు. బ్యాండు మేళాలు... పోతరాజుల నృత్యాలు...శివసత్తుల నడుమ నిషాక్రాంతి బంగారుబోనంతో విజయవాడ పురవీధులలో గుండా ఇంద్ర కీలాద్రిపై న ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా ముందుకు సాగారు. అక్కడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యాన్ని సమర్పించారు. గత 14 సంవత్సరాలుగా ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అమ్మవారికి భక్తి శ్రద్దలతో బంగారుబోనాన్ని సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్ర కీలాద్రి దేవ స్థానం ఇఓ శ్రీను నాయక్, బోర్డు మెంబర్లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఊరేగింపు కమిటీ ప్రధాన కార్యదర్శి గురునాథ్ రెడ్డి, వివిధ ఆలయ కమిటీ ప్రతినిధులు గాజుల అంజయ్య, మధుసూదన్ యాదవ్, జనగామ మధుసూధన్గౌడ్, ఎర్మనీ కైలాష్, ప్రభాకర్,కె ఎస్ ఆనంద్‌కుమార్, ఆదర్ల మహేష్, పండరీ నాథ్, తదితరులు పాల్గొన్నారు.