సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇంటలెక్చువల్ ఫోరమ్ ప్రతినిధుల బృందం

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇంటలెక్చువల్ ఫోరమ్ ప్రతినిధుల బృందం

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇంటలెక్చువల్ ఫోరమ్ ప్రతినిధుల బృందం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. మాదిగ, మాంగ్, చమర్, ఇతర అనుబంధ కులాల సాధికారత కోసం  గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ పనిచేస్తోంది. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. సీఎంను కలిసినవారిలో గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ జాతీయ అధ్యక్షురాలు, రిటైర్డ్ ఐఏఎస్ కె.రత్నప్రభ , ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఐపీఎస్ కె.బాబు రావు , డాక్టర్ విద్యాసాగర్ తో పాటు ఇతర ముఖ్యులు ఉన్నారు. ఫోరమ్ తరఫున చేపడుతున్న కార్యక్రమాల గురించి వారు ముఖ్యమంత్రికి వివరించారు.