స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజిక వర్గానికి అన్ని పార్టీలు సముచిత అవకాశాలు కల్పించాలి : ఎమ్మెల్సీ కవిత

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజిక వర్గానికి అన్ని పార్టీలు సముచిత అవకాశాలు కల్పించాలి : ఎమ్మెల్సీ కవిత

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజిక వర్గానికి అన్ని పార్టీలు సముచిత అవకాశాలు కల్పించాలి : ఎమ్మెల్సీ కవిత

ఏకలవ్యుడి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ప్రజా క్షేత్ర్,, హైదరాబాద్ : 

ఏకలవ్యుడు భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్ వద్ద జరిగిన ఏకలవ్యుడి జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కెసిఆర్ మొదలుపెట్టిన ఏకలవ్యుడు భవన నిర్మాణాన్ని పూర్తి చేయని దారుణ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.  కేసీఆర్ ఎరుకల ఎంపవర్మెంట్ స్కీంని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, పలు సందర్భాల్లో నేను శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనెత్తానన్నారు. అయినా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు.50 వేల ఎరుకల కుటుంబాలకు రూ 60 కోట్ల మేర లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని మరింత మెరుగుపరిచి ప్రభుత్వం యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎరుకల సామాజిక వర్గ రాజకీయ అభివృద్ధి కోసం కూడా అందరూ కృషి చేయాలన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజిక వర్గానికి అన్ని పార్టీలు సముచిత అవకాశాలు కల్పించాలన్నారు.రూ 500 కోట్లతో తక్షణమే ఎరుకల కార్పొరేషన్ లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.బహుజనుల పట్ల ఏ విధంగా అణిచివేత ఉందని చెప్పడానికి ఏకలవ్యుడి జీవితమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చారు. చరిత్రలో నిలబడిపోయే త్యాగం చేసిన ఏకలవ్యుడి అందరికీ స్ఫూర్తి ప్రదాత అని, సమాజానికి మంచి మార్గం చూపించే ప్రయత్నం చేసి ఆరాధ్య దైవమయ్యారు బహుజనలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు దక్కాలన్న ఉద్యమంలో పాల్పంచుకోవడం సంతోషంగా ఉంది.రాబోయే రోజుల్లో ఏకలవ్యుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకునే ప్రయత్నం చేద్దామని పేర్కొన్నారు.