యాదగిరిగుట్ట దేవస్థానంలో చింతపండు చోరీ కేసు....దోషులపై సీరియస్ యాక్షన్ షురూ

యాదగిరిగుట్ట దేవస్థానంలో చింతపండు  చోరీ కేసు....దోషులపై సీరియస్ యాక్షన్ షురూ

యాదగిరిగుట్ట దేవస్థానంలో చింతపండు  చోరీ కేసు....

 దోషులపై సీరియస్ యాక్షన్ షురూ 

* పలువురికి సంజాయిషీ నోటీసులు ,చార్జీ మెమోలు, సస్పెన్షన్లు 

* కమిటీ విచారణ లో విస్తుపోయే నిజాలు 

 ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్ట జూన్ 30 :

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఇటివల జరిగిన చింతపండు దొంగతనం సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది .కేసుకు సంబంధించిన దోషులపై  చర్యలు ప్రారంభమయ్యాయి. పులిహోర ప్రసాదానికి మూల సరుకు చింతపండు.దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు ఈ కేసు పై సీరియస్ గా స్పందించి ఐదుగురు సభ్యులతో   కమిటీ వేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కూడా ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీ నియమించారు . విచారణ అధికారులు యాదగిరిగుట్టకు విచ్చేసి దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పలువురు సిబ్బందితో విషయం అడిగి తెలుసుకున్నారు .విచారణ కమిటీ తన నివేదికను సమర్పించింది. దీంతో తదుపరి చర్యలలో భాగంగా పలువురికి షోకాస్ నోటీసులు ...సంజాయిషులు.. సస్పెన్షన్లు చేపట్టారు. ప్రసాద విక్ర యశాల విభాగంలో స్టాక్ రిజిస్టర్ లో అవకతవకలు కనుగొన్నారు. స్టోర్ గుమస్తా పి నవీన్ ,సీనియర్ అసిస్టెంట్ ప్రసాదాల తయారీ సరుకుల హెచ్చుతగ్గుల వివరాలను పై అధికారులకు తెలియపరచక అవుట్సోర్సింగ్ సిబ్బంది దొంగతనం చేయడానికి అవకాశం కల్పించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సహాయపాచకులు టి వాసు, ఎస్ బి సంతోష్, కృష్ణమాచార్యులకు పాటు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు . అదేవిధంగా విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా వెనువెంటనే జారీ చేశారు. ప్రసాదాల తయారీ స్టాక్ ను, రిజిస్టర్ను  ఎప్పటికప్పుడు పరిశీలించక విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, ఉదాసీనంగా వ్యవహరించడం, ఫలితంగా అజమాయిషి లోపించి క్రింది స్థాయి సిబ్బంది అవకతవకలకు పాల్పడేందుకు పరోక్షంగా అవకాశం కల్పించిన సంబంధిత పర్యవేక్షకుడు ఏ సత్యనారాయణ శర్మ, బి వెంకటేశం పై అభియోగాలు మోపారు . వారిని చార్జీ మెమో ద్వారా సంజాయిషీ కోరారు.