నందలూరు, తాళ్లపాక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్

నందలూరు, తాళ్లపాక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్

నందలూరు, తాళ్లపాక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్
ప్రజా క్షేత్ర్, తిరుమల :
అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను టీటీడీ చైర్మన్  బీ.ఆర్. నాయుడు అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆవిష్కరించారు. గురువారం తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో ఆయన పాల్గొని, వివరాలు వెల్లడించారు. జూలై 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు నందలూరులో శ్రీ సౌమ్యనాథస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అలాగే, జూలై 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు తాళ్లపాకలో శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయాల విశిష్టతలు, చారిత్రక నేపథ్యాన్ని చైర్మన్‌ కు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు  నటేష్ బాబు,  ప్రశాంతి పాల్గొన్నారు.