చాంద్రాయణ గుట్టలో మంచినీరు, సివరేజ్ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకుల వినతి

చాంద్రాయణ గుట్టలో మంచినీరు, సివరేజ్ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకుల వినతి

చాంద్రాయణ గుట్టలో మంచినీరు, సివరేజ్ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకుల వినతి

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మంచి నీరు, సివరేజ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  వాటర్ వర్క్స్ జిఎం సంతోష్ కు గురువారం లలిత బాగా డివిజన్ కంటెస్టెడ్ బిజెపి కార్పొరేటర్ మాదిరి చంద్రశేఖర్, బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు మాణిక్, యువమోర్చా నాయకులు సుభాష్ లు ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు అందజేసిన విజ్ఞాపన పత్రంలో చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలోని లలితా బాగ్, ఉప్పుగూడ డివిజన్ , రియాసత్ నగర్ డివిజన్ ప్రాంతాలలో మంచినీటి సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అలాగే తాతల కాలం నాటి సివరేజ్ వ్యవస్థ తో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరన్నారు. వెంటనే ఆయా ప్రాంతాలలో నెలకొన్న మంచినీటి, సివరేజ్ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.