శ్రీ జగదాంబ దేవాలయంలో అక్టోబరు 3 నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు : రాకేష్​ తివారి

శ్రీ జగదాంబ దేవాలయంలో అక్టోబరు 3 నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు : రాకేష్​ తివారి

శ్రీ జగదాంబ దేవాలయంలో అక్టోబరు 3 నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు : రాకేష్​ తివారి

ప్రజాక్షేత్ర్, వెబ్​ న్యూస్​ 

సుల్తాన్​షాహి శ్రీ జగదాంబ దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహంచడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్​ రాకేష్​ తివారి తెలిపారు. ఈ నెల 3 వ తేదీన పాడ్యమి హస్తా నక్షత్రం శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారం, నైవేద్యం పులిహోర, 4వ తేదీన విధిత చిత్తా నక్షత్రం, శ్రీ గాయత్రీ దేవి అలంకారం, నైవేద్యం కొబ్బరి అన్నం, 5వ తేదీన తదియ స్వాతి నక్షత్రం, శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం, నైవేద్యం అల్లం గారెలు, 6వ తేదీన చవితి విశాఖ నక్షత్రం, శ్రీలలితా త్రిపుర సుందరి దేవి అలంకారం, నైవేద్యం రవ్వకేసరి, 7వ తేదీన పంచమి అనురాధ నక్షత్రం, శ్రీ మహాచండీదేవి అలంకారం, నైవేద్యం శాకన్నం, 8వ తేదీన షష్ఠి జ్యేష్ట్యా నక్షత్రం , శ్రీ మహాలక్షమి దేవి అలంకారం, నైవేద్యం, దద్దోజనం, 9వ తేదీన మూలా నక్షత్రం శ్రీ సరస్వతి దేవి అలంకారం, నైవేద్యం పెసర, బూరెలు, పులిహోర, 10వ తేదీన అష్టమి పూర్వాషాడ , శ్రీ దుర్గాదేవి అలంకారం, నైవేద్యం కదంబము, 11వ తేదీన నవమి ఉత్తరాషాఢ, శ్రీ మహిషాసుర మర్దని దేవి అలంకారం, నైవేద్యం గారెలు, పులి హోర, 12వ తేదీన దశమి శ్రవణా నక్షత్రం, శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, నైవేద్యం పరమాన్నం, కేసరన్నం  సమర్పించనున్నట్లు చెప్పారు. 3వ తేదీన అమ్మవారికి అభిషేకం, ఊంజల్​ సేవ, పంచ హారతి, 4వ తేదీన 108 మహిళా మాతృ మూర్తుల చే లక్ష పుష్పార్చన, 5వ తేదీన రంగోలి, ఆటల పోటీలు, 6వ తేదీన దాండియా, బతుకమ్మ కార్యక్రమాలు, 7వ తేదీన చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, 11వ తేదీన 108 మహిళా మూర్తులచే కుంకుమార్చన, 12వ తేదీన యజ్ఞ మహా పూర్ణాహుతి, అమ్మవారి ఊరేగింపు, బతుకమ్మ ఆట పాటలతో ఉత్సవాలు ముగుస్తామని రాకేష్ తివారి పేర్కొన్నారు.